ఒక్కొక్కరికీ 12 గంటల డ్యూటీ!

ఒక్కొక్కరికీ 12 గంటల డ్యూటీ!

సరిపడా స్టాఫ్ లేక గాంధీ డాక్టర్లపై పని ఒత్తిడి
నర్సులు, పారామెడికల్ సిబ్బందిదీ అదే పరిస్థితి
వేరే ఆస్పత్రుల్లోనూ ట్రీట్‌మెంట్‌ చేయాలన్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: గాంధీ హాస్పిటల్.. ప్రస్తుతం కరోనా ట్రీట్మెంట్కు కేరాఫ్. రాష్ట్రంలో కేసు ఎక్కడ నమోదైనా రావాల్సింది ఇక్కడికే. రోజురోజుకు కేసుల లోడ్ ఎక్కువై పోతుండడంతో అక్కడి డాక్టర్ల పరిస్థితి దయనీయంగా తయారైంది. పని ఒత్తిడి పెరిగింది. ఒక్కో డాక్టరుకు 12 గంటల
డ్యూటీ వేస్తున్నారు. డాక్టర్లే కాదు.. నర్సులు, పారామెడికల్ స్టాఫ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కేసులకు తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సరిపడా స్టాఫ్ లేకపోవడంతో ఉన్న వాళ్లపైనే పని భారం పెరుగుతోంది. ఆ ఎఫెక్ట్ పేషెంట్లపై పడుతోంది. గాంధీలో డాక్టర్లు తమను పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులొస్తున్నాయి. రాత్రి ఆస్పత్రిలో చేరిన పేషెంట్ దగ్గరకు తెల్లారి మధ్యాహ్నం అయినా డాక్టర్లు రావడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విపరీతమైన పని ఒత్తిడి వల్లే ఇలా జరుగుతోందని డాక్టర్లు అంటున్నారు. రెండ్రోజుల క్రితం వరకూ గాంధీలో సుమారు వెయ్యి మంది పేషెంట్లు ఉన్నారని, వర్క్ లోడ్ ఎక్కువ అవ్వడం వల్లే వందలాది కరోనా పేషెంట్లను ఐసీఎంఆర్ రూల్సుకు విరుద్ధంగా ఇంటికి
పంపించారని అంటున్నారు.

టిమ్స్ లో ట్రీట్మెంట్కు సమస్యేంటి?
రోజూ కేసులు పెరుగుతుండడం, మున్ముందు ఇంకా ఎక్కువయ్యే ముప్పు ఉండటంతో ఒక్క గాంధీలోనే ట్రీట్మెంట్ అంటే సాధ్యం కాదని డాక్టర్లు తేల్చిచెబుతున్నారు. కరోనా కోసమే ఏర్పాటు చేసిన టిమ్స్ హాస్పిటల్ అలంకారప్రాయంగా మారిందని, అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి సమస్య ఏంటో తెలియట్లేదని వాపోతున్నారు. ప్రస్తుతం రోజూ 400 నుంచి 600 దాకా టెస్టులు చేస్తున్నారు. అందులో 19 నుంచి 20 శాతంవరకు పాజిటివ్ వస్తున్నాయి. ఇలా చేస్తూ పోతే మరో నెలలో కేసులు 13 వేలు దాటే అవకాశం ఉంది. టెస్టులు పెంచితే కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. ఇందులో కనీసం 2 వేల మంది సివియర్ పేషెంట్లు ఉండే అవకాశముంది. కాబట్టి ఒక్కటే హాస్పిటల్లో కరోనా ట్రీట్మెంట్ అంటే ఎట్లా సాధ్యమవుతుందని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే గాంధీలో కొంతమంది డాక్టర్లు, సిబ్బంది వైరస్ బారిన పడ్డారని, పేషెంట్లు పెరిగితే మరింత మంది వైరస్ బారిన పడక తప్పదని అంటున్నారు. ఇప్పటికైనా వేరే ఆస్పత్రుల్లోనూ కరోనా ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయాలని కోరుతున్నారు.

రిక్రూట్మెంటే పరిష్కారం
ఖాళీలను భర్తీచేయడమే గాంధీలో సమస్యకు పరిష్కారమని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. డాక్టర్లు, నర్సులు, సిబ్బందిని నియమిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందంటున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఐసీయూ టెక్నీషియన్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, వార్డు బాయ్స్, పేషెంట్ కేర్ ప్రొవైడర్స్ కొరత ఉంది. బుధవారం ఆరోగ్య మంత్రి ఈటలకు ఇచ్చిన వినతి పత్రంలోనూ వాళ్లు ఈ విషయాన్ని పేర్కొన్నారు. వెంటనే ఆ పోస్టులను భర్తీచేయాలని కోరారు. ఆస్పత్రిలో సరైన సెక్యూరిటీ లేదని, పేషెంట్ల అటెండర్లు సరాసరి వార్డుల్లోకి వచ్చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. మంగళవారం రాత్రి వార్డుల్లో ఉన్న డాక్టర్ల వద్దకు వచ్చి దాడి చేశారని చెబుతున్నారు. ఇంతకుముందూ ఇలాగే దాడి జరిగిందని, ఎస్పీఎఫ్ ప్రొటెక్షన్ పెట్టాలని కోరుతున్నారు.

For More News..

ఎంసెట్‌కు 2.19 లక్షల అప్లికేషన్లు

గాంధీ పొమ్మంది.. ఊరు వద్దంది

బతుకు భరోసా లేని జర్నలిస్టులు

ఆస్పత్రి వాష్ రూంలో కరోనా పేషంట్ డెడ్ బాడీ