ఉప్పల్: జాబ్మేళాలో 1,306 మందికి ఉద్యోగాలు

ఉప్పల్: జాబ్మేళాలో 1,306 మందికి  ఉద్యోగాలు

ఉప్పల్, వెలుగు: తెలంగాణ ట్రైనింగ్ అండ్​ప్లేస్​మెంట్ ఆఫీసర్స్​ అసోసియేషన్, జీవీకే ఫౌండేషన్​ల ఆధ్వర్యంలో శనివారం ఓయూలో నిర్వహించిన మెగా జాబ్​మేళా సక్సెస్​అయిందని నిర్వాహకులు తెలిపారు. 

9 వేల మందికి పైగా నిరుద్యోగ యువత హాజరవగా.. పలు కంపెనీలు 1,306 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశాయి. మొదటి విడతలో 26 మందికి ఆఫర్​లెటర్లు అందజేశారు.  అసోసియేషన్​ప్రెసిడెంట్ డాక్టర్ జైరాం, ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ జీవీకే, వలంటీర్లు పాల్గొన్నారు.