4 నెలల్లో 13,429 డ్రంకెన్ డ్రైవ్ కేసులు

4 నెలల్లో 13,429 డ్రంకెన్ డ్రైవ్ కేసులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైదరాబాద్ ​ట్రాఫిక్ పోలీ సులు రిమూవల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ అబ్‌‌‌‌‌‌‌‌స్ట్రక్టివ్‌‌‌‌‌‌‌‌ పార్కింగ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌క్రోచ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌(రోప్‌‌‌‌‌‌‌‌)లో భాగంగా స్పెషల్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తున్నారు.ప్రజల్లో అవగాహన కలిగిస్తూనే రూల్స్ పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రమాదాల నివారణ కోసం స్టాప్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌ వయొలేషన్‌‌‌‌‌‌‌‌, ఫ్రీ లెఫ్ట్‌‌‌‌‌‌‌‌, ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌ల ఆక్రమణపై ఫోకస్ పెట్టారు.ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ వరకు స్పెషల్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్ నిర్వహించారు. 

ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌లను ఆక్రమించిన వారిపై 332 ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నమోదు చేశారు.13,429 డ్రంకెన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ కేసులు రిజిస్టర్ చేశారు. ఇందులో1,317 మందికి జైలు శిక్షలు పడగా.. మరికొందరికి రూ.3.21 కోట్లు జరిమానాలు విధించారు. స్పెషల్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్ వివరాలను ట్రాఫిక్ చీఫ్ సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు శుక్రవారం ఓ  ప్రకటనలో వెల్లడించారు.