పురుగుమందు స్ప్రేతో 14 మంది కూలీలకు అస్వస్థత

పురుగుమందు స్ప్రేతో 14 మంది కూలీలకు అస్వస్థత

సుజాతనగర్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం కొత్త అంజనాపురంలో పురుగుమందు స్ప్రే కారణంగా 14 మంది వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల కింద నర్రా అజయ్‌‌‌‌కు చెందిన పంట పొలంలో సుమారు 20 మంది కూలీలు కలుపు తీస్తుండగా, పురుగుమందు పిచికారీ చేసినట్లు సమాచారం. స్ప్రే తుంపర్లు కళ్లలో, ముక్కుల్లో పడటంతో పాటు వాసన పీల్చడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు.

ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించడంతో బుధవారం కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం 14 మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మిగతా 12 మంది పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై అధికారులు విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూలీల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు