అసెంబ్లీ ప్రాంతంలో 144సెక్షన్ విధింపు

అసెంబ్లీ ప్రాంతంలో 144సెక్షన్ విధింపు

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి వీఆర్ఏలు యత్నంచారు. వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వీఆర్ఏలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం కేసీఆర్ VRAలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.  వెంటనే రాష్ట్ర సర్కార్ ప్లే స్కేల్ ను పెంచాలన్నారు. ఇప్పటికే ఒత్తిడి తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 36మంది VRAలు సూసైడ్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏల ను అరెస్ట్ చేసిన పోలీసులు... స్టేషన్ కు తరలించారు. వీఆర్ఏలు, టీచర్ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు 144 సెక్షన్ విధించి, భద్రతను కట్టుదిట్టం చేశారు.