ప్రపంచ రికార్డు కోసం 11 రోజులు నిద్ర పోలేదు.. ఇప్పుడు ఆ కుర్రోడి ఆరోగ్యం ఎలా ఉంది..?

ప్రపంచ రికార్డు కోసం 11 రోజులు నిద్ర పోలేదు.. ఇప్పుడు ఆ కుర్రోడి ఆరోగ్యం ఎలా ఉంది..?

ఒక్క రోజు సరిగా నిద్రపోకపోతేనే ఆఫీసులో కునుకుపోట్లు పడతాం.. సరిగా పని చేయలేం.. తిన్నది కూడా సరిగా అరగదు.. అలాంటిది 17 ఏళ్ల కుర్రోడు.. ప్రపంచ రికార్డు కోసం ఏకంగా 11 రోజులు అస్సలు నిద్రపోలేదు. అనుకున్నట్లుగానే ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇదంతా గతం.. ఇప్పుడు ఆ యువకుడి ఆరోగ్యం ఎలా ఉంది అనేది చర్చనీయాంశం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

డిసెంబరు 1963లో, గార్డనర్ మరియు అతని స్నేహితుడు బ్రూస్ మెక్‌అలిస్టర్, వారు ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు సైన్స్ ఫెయిర్ ప్రాజెక్ట్ కోసం ఒక ఆలోచన గురించి ఆలోచించారు. వారు ఎంతసేపు మెలకువగా ఉండగలరో చూడాలని ...  ప్రయోగం యొక్క దుష్ప్రభావాలను రికార్డ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

గార్డనర్ మేల్కొని ఉన్న సమయంలో మెక్‌అలిస్టర్ నిద్రలోకి జారుకోవడంతో  జో మార్సియానో ​​అనే మూడవ వ్యక్తిని  వారు నిద్రపోకుండా ఉంచేందుకు నియమించుకున్నారు. అయితే ఈ ప్రయోగాన్ని   స్టాన్‌ఫోర్డ్ నిద్ర పరిశోధకుడు డాక్టర్ విలియం డిమెంట్ , యుఎస్ నేవీ మెడిక్ లెఫ్టినెంట్ కమాండర్ జాన్ జె రాస్ కూడా పరిశీలించారు. మూడో రోజు గార్డనర్  భావోద్వేగానికి గురికావడంతో.. నాలుగో రోజునుంచి తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి తోటి విద్యార్థులతో బాస్కెట్ బాల్, పిన్ బాల్ ఆడాడు.  

 గార్డనర్ ,  అతని స్నేహితుడు బ్రూస్ మెక్‌అలిస్టర్ చేపట్టిన ప్రయోగం1964  జనవరి 8 న ముగిసిన తరువాత  మెదడు తరంగాలను పర్యవేక్షించే ఆసుపత్రికి తీసుకెళ్లారు.  అతను 264 గంటల 4 నిమిషాలు గంటలపాటు మెలకువగా ఉండగలిగాడు.  ప్రయోగం ముగిసిన తర్వాత గార్డనర్ 14 గంటల 40 నిమిషాలు నిద్రపోయాడు.  తరువాత రోజు సాయంత్రం 7.30 వరకు మేల్కొని... ఆ తరువాత పదిన్నర గంటలు నిద్రపోయాడు. ఆ తరువాత  క్రమంగా సహజ నిద్రకు (రోజుకు 8 గంటలు) వచ్చాడు  .

ప్రయోగం చేస్తున్నసమయంలో   గార్డనర్ ఆరోగ్యం విషయంలో ఎలాంటి ప్రభావం చూపలేదు.  తరువా వారికి రుచి, వాసన, వినికిడి వంటి విషయాలను పరీక్షించారు.    అలెక్స్ ఇంద్రియ సామర్ధ్యాలు క్షీణించాయి.  తరువాత గార్డనర్ రికార్డ్ ను అధిగమించేందుకు కొందరు ప్రయత్నించారు.  ఈ ప్రయోగం ఆరోగ్య విషయంలో ప్రభావం చూపుతుంది.  ఈ కారణంగా నిద్రలేమి విషయంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ను బుక్ లో నమోదు చేయడం ఆపివేశారు.