
- రాష్ట్రం వివరాలు వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: గతేడాది సెప్టెంబర్ వరకు తెలంగాణలో 1,730 అంగన్ వాడీ టీచర్లు, 3,064 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. మొత్తం 35,700 అంగన్ వాడీ టీచర్ల పోస్టులు శాంక్షన్ చేస్తే.. ప్రస్తుతం 33,970 మంది పని చేస్తున్నట్టు తెలిపింది. మొత్తం 31, 711 శాంక్షన్ పోస్టులకు గాను.. 28, 647 అంగన్ వాడీ హెల్పర్లు విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. శుక్రవారం లోక్ సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ వివరాలు వెల్లడించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం తెలంగాణలో 2017–2019 మధ్య 11,539 మంది చిన్నారులపై లైంగిక దాడులు జరిగాయని స్మృతి ఇరానీ చెప్పారు.