ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న కంటైనర్ను ఢీ కొన్న టెంపో.. 18 మంది స్పాట్ డెడ్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న కంటైనర్ను ఢీ కొన్న టెంపో.. 18 మంది స్పాట్ డెడ్

ఫలోది: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫలోది జిల్లాలోని ఫలోది దగ్గరలో ఉండే మటోడా గ్రామం సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ను టెంపో ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు.

ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులందరూ మథానియా వాసులుగా తెలిసింది. సహాయక చర్యల కోసం పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

జోధ్‌పూర్‌లోని సుర్‌సాగర్‌కు చెందిన ఈ యాత్రికులు బికనీర్‌లోని కొలాయత్ ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్లోని ఫలోది భారత్ మాల హైవేపై ఈ ఘోరం జరిగింది. బికనీర్‌లోని కోలాయత్ నుంచి వస్తున్న టెంపో-ట్రావెలర్ రోడ్డుపై ఆగి ఉన్న ట్రయిలర్‌ వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టింది. 

ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. అన్ని మృతదేహాలను ఒసియన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. గాయపడిన వారిని ఇప్పుడు జోధ్‌పూర్‌కు పంపారు. గాయపడిన వారిని చికిత్స కోసం జోధ్‌పూర్‌కు తరలించినట్లు జిల్లా కలెక్టర్ శ్వేతా చౌహాన్ తెలిపారు.