అగ్రరాజ్యం నెత్తరోడింది. అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. మెక్సికో సిటీకి వెళ్లే హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కార్గో ట్రాక్ బీభత్సం సృష్టించింది. టోల్ బూతు వద్ద నిలిచి ఉన్న పలు వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయాల పాలయ్యారు. ఈ ఘటనలో కొన్ని వాహనలకు మంటలు కూడా వ్యాపించాయి.
టోల్ బూత్‌ను క్రాస్ చేస్తున్న సమయంలో ట్రక్... అదుపు తప్పి ఆరు వాహనాల్ని ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో చనిపోయినవారిలో ట్రక్ డ్రైవర్ కూడా ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. హైవేపై ట్రాఫిక్ నిలిచిపోకుండా.. ఘటనాస్థలంలో ఉన్న వాహనాల్ని అధికారులు తొలగించారు. అయితే ఈ హైవేపై ఎక్కువగా కార్గో ట్రక్స్ ప్రయాణిస్తుంటాయిని అక్కడి అధికారులు, స్థానికులు చెబుతున్నారు.
