కుమారి 19 ఎఫ్.. మృతి

కుమారి 19 ఎఫ్.. మృతి

విశాఖ పట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో ఉన్న తెల్ల పులి కుమారి(19)  మృతి చెందింది. ఇది 2004 లో జన్మించింది. 2007లో హైదరాబాద్ లోని నెహ్రూ జంతుప్రదర్శన శాల నుంచి మగ భాగస్వామితో కలిపి దీనిని వైజాగ్ జూ కి తీసుకువచ్చారు. అక్కడే ఈ జంట తొమ్మిది పులి పిల్లలకు జన్మనిచ్చింది. 

ఆర్గాన్ ఫెల్యూరే కారణం...

ఆర్గాన్ ఫెయిల్యూరే కుమారి మృతికి కారణమయిందని పోస్ట్ మార్టం నివేదికలో ఉంది. ఈ రకం పులులు అంతరించే దశలో ఉన్నాయి. ఇండియాలో మధ్యప్రదేశ్, అసోం, సుందర్ బన్స్ ప్రాంతాల్లోని అడవుల్లో ఇవి నివసిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.