హైదరాబాద్, వెలుగు: వివిధ డిపార్ట్‌మెంట్లలోని ఖాళీగా ఉన్న 1,927 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇందులో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో నే 1,200 వరకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. మిగతావి ఆర్ అండ్ బీ, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, గ్రౌండ్‌వాటర్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున ఇంజనీర్ల రిక్రూట్‌మెంట్‌కు అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారని హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశం, కార్యదర్శులు మహేందర్, చక్రధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్, ట్రెజరర్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రమ ఒక ప్రకటనలో తెలిపారు.
