భర్త వేధింపులకు 20 ఏళ్ల గర్భిణీ స్త్రీ బలి.. ఇంటి వెనకాలే నిప్పంటించుకుని మృతి..

 భర్త వేధింపులకు 20 ఏళ్ల గర్భిణీ స్త్రీ బలి.. ఇంటి వెనకాలే నిప్పంటించుకుని మృతి..

కేరళలో భర్త వేధింపులకు ఓ 20 ఏళ్ల గర్భిణీ స్త్రీ ప్రాణాలు వదిలింది. ఆమె ఉండే ఇంటి వెనుకాలే శవమై కనిపించింది. అర్చనగా గుర్తించిన మహిళను తనను తాను నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోగా..  అర్చన కుటుంబం ఆమె భర్తపై గృహ హింస కేసు పెట్టింది.  

వివరాల ప్రకారం అర్చన ఆరు నెలల క్రితం కేరళలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన షారన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అర్చన తల్లిదండ్రుల ప్రకారం, షారన్ ఆమెను రోజు వేధించేవాడు అలాగే  తల్లితండ్రులతో మాట్లాడకుండా చేసేవాడు. 

నిన్న బుధవారం మధ్యాహ్నం అర్చన అత్త మనవడిని అంగన్‌వాడీ నుండి తీసుకురావడానికి వెళ్లగా అదే సమయంలో అర్చన ఇంటి వెనుక ఉన్న కాంక్రీట్ షెడ్‌లో చనిపోయి కనిపించింది. 

 కూతురుని కోల్పోయి కుంగిపోయిన అర్చన తండ్రి హరిదాస్‌  అర్చన భర్త షారన్ క్రూరమైన వ్యక్తి అని, ఒకరోజు ఆమెని కాలేజీ ముందే  కొట్టాడని ఆరోపించాడు. ఆ తర్వాత ఆమెను మాతో  కలవకుండా, ఫోన్‌లో మాట్లాకుండా చేసాడని అన్నారు.

అర్చన సోదరి కూడా షారన్  అర్చనని బి.టెక్ చదవకుండా, విదేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించింది. అర్చన బి.టెక్ పూర్తి చేసి కెనడాలో స్థిరపడాలని ఎన్నో కలలు కన్నది.  కానీ షారన్ ఎప్పుడూ ఆమెను హింసిస్తూ, భయపెట్టేవాడు... చివరిసారి నేను అర్చనను  రైల్వే స్టేషన్‌లో చూశాను. ఆమెను మాతో  మాట్లాడనివ్వలేదు, కలవనివ్వలేదు అని చెప్పింది

తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి షారన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షారన్ మద్యం, మాదకద్రవ్యాలకు బానిస అయినల్టు  పోలీసులు నిర్ధారించగా... దర్యాప్తులో భాగంగా షారన్, అతని తల్లిపై వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.