హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోయిన ఏడాది సుమారు 20 వేల మంది కొత్తగా కేన్సర్ బారినపడ్డారు. ఒక్క ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్‌లోనే పది వేల మంది కొత్త పేషెంట్లు రిజిస్టర్ అయ్యా రు. ప్రైవేట్ హాస్పిటళ్లలో మరో పది వేల మంది వరకూచికిత్స పొందుతున్నారు. పొగాకు, గుట్కా, సిగరెట్,పాన్ వినియోగం మన రాష్ట్రంలో ఎక్కువగా ఉండడమే కేన్సర్ కేసులు పెరగడానికి కారణమవుతోంది. గతేడాది నమోదైన కేసుల్లో 22% టొబాకో కారణంగానే వచ్చాయని గుర్తించినట్లు ఎంఎన్‌జేకేన్సర్ హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత బ్రెస్ట్ కేన్సర్, సర్వికల్ కేన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వరల్డ్ కేన్సర్ ప్రివెన్షన్ డే సందర్భంగా ఎంఎన్‌జే హాస్పిటల్ ఈ విషయాలను వెల్లడించింది.ఎంఎన్‌జేలో రిజిస్టర్ అయిన కేసుల్లో అత్యధి కంగాపొగాకు, గుట్కా వంటి టొబాకో సంబంధి త కేన్సర్కేసులు ఉండగా, 15% బ్రెస్ట్, 14% సర్వి కల్ కేన్సర్ కేసులు ఉన్నాయని హాస్పిటల్ డైరెక్టర్, డాక్టర్ జయలలిత తెలిపారు. పిల్లల్లో బ్లడ్ కేన్సర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని, రికవరీ రేట్ కూడా అదేస్థాయి లో ఉందన్నారు. ఎర్లీ స్టేజ్‌లో గుర్తించి ట్రీట్‌మెంట్‌కువచ్చిన వాళ్లలో సుమారు 60% మంది పూర్తిగా కోలుకుంటున్నారని తెలిపారు. గతేడాది ఎంఎన్‌జేహాస్పిటల్ తరపున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోక్యాంపులు నిర్వహించి 7,563 మందిని స్ర్కీన్ చేసి 350 మందికి కేన్సర్ ఉన్నట్టు గుర్తించామని జయలలిత వెల్లడిం చారు. కేన్సర్ స్ర్కీనింగ్ కోసం మొబైల్ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
