24 గంటల్లో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు

24 గంటల్లో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు

భారతదేశంలో కరోనా ఉధృతి ఇంకా కంటిన్యూ అవుతోంది. పలు రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతుందన్న క్రమంలో.. మరోసారి పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. 20 వేలకు పైగానే కేసులు బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో 20 వేల 044 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ నుంచి 18 వేల 301 మంది కోలుకున్నట్లు తెలిపింది. మొత్తం మరణాల సంఖ్య 56గా ఉందని, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,40,760గా ఉందని తెలిపింది.

ఇప్పటి వరకు 4 కోట్ల 37 లక్షల 30 వేల 071 కేసులు నమోదయితే.. 4 కోట్ల 30 లక్షల 63 వేల 651 మంది కోలుకున్నారు. 5 లక్షల 25 వేల 660 మంది చనిపోయారు. పాజిటివిటీ రేటు 4.80.. రికవరీ రేటు 98.48గా ఉంది. ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. 1,99,71,61,438 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. 24 గంటల్లో 22 లక్షల 93 వేల 627 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.