టాటా మోటార్స్ సరికొత్త 'నెక్స్ట్ జనరేషన్ టియాగో' కారును పెట్రోల్, ఐ–సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లలో విడుదల చేసింది. పెట్రోల్ కారు ధర రూ.4.69 లక్షల నుంచి, ఎలక్ట్రిక్ వెర్షన్ ధర రూ.ఏడు లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ఈ–కార్లలో 19 కిలోవాట్స్, 24 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ సిస్టమ్స్ ఇచ్చారు. పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లలో 360 డిగ్రీల సరౌండ్ వ్యూ సిస్టమ్, డబుల్ ఇంపాక్ట్ కొలిజన్ ప్రొటెక్షన్ ఫీచర్లను అందించారు.
