
అహ్మదాబాద్: 2029లో జరగనున్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, ఏక్తా నగర్ లలో వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ జరగనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణమని పేర్కొంటూ శుక్రవారం ట్వీట్ చేశారు.
" ప్రపంచ పోలీసు క్రీడలు జరపడానికి భారత్ ఎంపికైంది. దీనిద్వారా భారత దేశ క్రీడా మౌలిక సదుపాయాలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కినట్లయింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నిర్మితమైన విస్తృత క్రీడా సౌకర్యాలకు ఇది నిదర్శనం. ఈ గేమ్స్‌లో 70 దేశాల నుంచి 10 వేల మందికి పైగా పోలీసులు, అగ్నిమాపక, విపత్తు సేవలు, ఫస్ట్ రెస్పాండర్‌లు పాల్గొంటారు" అని అమిత్ షా పేర్కొన్నారు.