ఓల్డ్‌సిటీ, వెలుగు: ఐదేండ్లకు ఒకసారి జరిగే తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు జనవరి 30న జరగనున్నాయి. బుధవారం నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మొత్తం 209 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి వెల్లడించారు.
25 మంది సభ్యులను ఎన్నుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 56 వేల మంది న్యాయవాదులు ఓటు వేయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహిళలకు 30 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఐదుగురు మహిళా సభ్యులను ఎన్నుకోనున్నారు.
ఈ అవకాశంతో మహిళలు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. మహిళల రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టులో కేసు వేసి సాధించిన శారదా గౌడ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు పున్నం అశోక్ గౌడ్ ప్యానెల్ నుంచి 20 మంది పోటీలో ఉన్నారు. మాజీ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, వెంకటేష్ యాదవ్ తదితరులు కూడా పోటీలో ఉన్నారు.
