కూకట్ పల్లిలో 21 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

కూకట్ పల్లిలో 21 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
  • నిందితులు పుణే వాసులు

జీడిమెట్ల, వెలుగు: ఒడిశా నుంచి పుణేకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని కూకట్​పల్లి పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పుణేకు చెందిన సచిన్, లౌకిక్​గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. 

దీంతో బుధవారం రాత్రి నిఘా ఉంచి కూకట్ పల్లిలో ఇద్దరినీ పట్టుకున్నారు. వారి వద్ద నుంచి  రూ.7 లక్షల విలువైన 21కిలోల  గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఒడిశా, బరంపూర్​ నుంచి పుణేకు తీసుకెళ్తున్నట్లు ఒప్పుకోవడంతో  వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.