మోడీ విదేశీ టూర్లకు ఖర్చు ఎంతో తెలుసా..?

మోడీ విదేశీ టూర్లకు ఖర్చు ఎంతో తెలుసా..?

ప్రధాని మోడీ విదేశీ పర్యటనల ఖర్చుల వివరాలను కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. మోడీ 2019 నుంచి ఇప్పటివరకు 21 విదేశీ ప్రయాణాలు చేశారని.. వీటికి గానూ రూ.22.76 కోట్లు ఖర్చు అయిందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాజ్యసభలో చెప్పారు. 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రపతి 8 విదేశీ ప్రయాణాలు చేశారని.. వాటికి గానూ రూ. 6.24 కోట్లు ఖర్చు అయ్యాయని వివరించారు. అదేవిధంగా విదేశాంగ మంత్రి జైశంకర్ 86 పర్యటనలు చేశారన్నారు. ఈ  పర్యటనల ఖర్చు రూ. 20.87 కోట్లని మురళీధరన్ తెలిపారు. 2019 నుంచి ప్రధాని మోడీ మూడుసార్లు జపాన్, రెండుసార్లు అమెరికా, రెండు సార్లు యూఏఈ లలో పర్యటించారు. రాష్ట్రపతి చేసిన 8 పర్యటనల్లో ఏడు పర్యటనలను గత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేయగా, ఒక పర్యటనను ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేశారు. ముర్ము గత సెప్టెంబర్లో యూకే వెళ్లారు.