
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో 24 వర్సిటీలు ఫేక్ అని, వాటికి గుర్తింపు ఇవ్వలేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) బుధవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని క్రైస్ట్ న్యూ టెస్ట్‌మెంట్ డీమ్డ్ యూనివర్సిటీకి కూడా గుర్తింపులేదని తెలిపింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి గుర్తింపు లేకుండా రన్ చేస్తున్న ఈ వర్సిటీల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ స్టూడెంట్లు, పేరెంట్స్‌ను కోరింది. వీటిలో ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయని, దాని తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉందని యూజీసీ సెక్రటరీ రజనీష్ జైన్ చెప్పారు. కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరిలలో ఒక్కో ఫేక్ యూనివర్సిటీ ఉందని తెలిపారు.