కొత్త అసెంబ్లీకి 25 ఎకరాలు కావాలె…

కొత్త అసెంబ్లీకి 25 ఎకరాలు కావాలె…

హైదరాబాద్‌‌, వెలుగుకొత్త అసెంబ్లీ కాంప్లెక్స్​నిర్మాణానికి పాతిక ఎకరాలదాకా అవసరమని ఆర్అండ్​బి ఈఎన్​సీ గణపతి రెడ్డి రాష్ట్ర హైకోర్టుకు వివరణ ఇచ్చారు. డిజైన్​ప్లానింగ్​కు సంబంధించిన పనులను ప్రభుత్వం వివిధ కన్సల్టెన్సీలకు అప్పగించిందని చెప్పారు. అవి వచ్చాకే కాంప్లెక్స్​లో ఏయే వసతులు ఉండేది తెలుస్తుందన్నారు. వచ్చిన ప్లాన్లలో నుంచి ప్రభుత్వం ఒకదానిని ఎంపిక చేస్తుందన్నారు. ఎర్రమంజిల్‌‌ బిల్డింగ్‌‌ కూల్చి కొత్త అసెంబ్లీ కాంప్లెక్స్‌‌ కట్టాలన్న సర్కారు నిర్ణయంపై దాఖలైన పిటిషన్లను కోర్టు శుక్రవారం విచారించింది. హైకోర్టు సీజే జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ ఎస్‌‌.అక్తర్‌‌లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ విచారించింది. ఎంత జాగా అవసరం. ఎన్ని గదులు కడతారు. ప్లాన్‌‌ ఏంది అని బెంచ్‌‌ ప్రశ్నించింది. జవాబుగా కొత్త అసెంబ్లీ కాంప్లెక్స్‌‌లోనే అసెంబ్లీ, కౌన్సిల్, స్పీకర్, చైర్మన్, సెక్రటరీల ఆఫీసులు, వాళ్లు ఉండేందుకు ఇండ్లు కూడా కట్టాలని ప్రభుత్వ సంకల్పమని గణపతి రెడ్డి వివరించారు. వారసత్వ భవనాల జాబితా నుంచి ఎర్రమంజిల్‌‌ని తప్పించామని, దీనికి చెందిన రూల్‌‌ 13 రద్దయిందని ప్రభుత్వం చెబుతున్నదానిపై వివరణ ఇవ్వాలని పిటిషనర్‌‌ను బెంచ్‌‌ కోరింది. నిబంధన 13ను రద్దు చేసినా దానిని హైదరాబాద్‌‌ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీలో ఉంచారని పిటిషనర్‌‌ లాయర్‌‌ చెప్పారు. హెచ్‌‌ఎండీఎ మాస్టర్‌‌ ప్లాన్‌‌లో ఉన్నందున ప్రభుత్వ వాదన చెల్లదన్నారు. హెచ్‌‌ఎండీఎ మాస్టర్‌‌ ప్లాన్, మ్యాప్, పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.