యూపీలో 25వేల మంది హోంగార్డుల తొలగింపు

యూపీలో 25వేల మంది హోంగార్డుల తొలగింపు

దీపావళి ముందు యూపీలో షాకిచ్చిన సీఎం యోగీ 

ఉత్తరప్రదేశ్ లో హోంగార్డ్ లు రోడ్డున పడ్డారు. బడ్జెట్ లేకపోవడంతో 25వేల మంది హోంగార్డ్ లను విధుల నుంచి తొలగిస్తూ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  గతంలో కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డ్ లకు జీతాలను పెంచాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో యోగి సర్కార్ హోంగార్డ్ లకు రూ.500 గా ఉన్న రోజువారీ వేతనాన్ని రూ.672లకు పెంచింది.

ఐతే..ఆగస్ట్ 28న  యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ , హోంగార్డ్ ల జీతభత్యాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలకు అనుగుణంగా.. 25వేల మంది హోంగార్డ్ లు విధుల నుంచి తప్పుకోవాలని అడిషనల్ డైరక్టర్ జనరల్ బీపీ జోగ్దాంగ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు మరో 99వేల మంది హోంగార్డ్ ల 25రోజుల పనిదినాల్ని 15రోజులకు తగ్గించింది యూపీ ప్రభుత్వం. బడ్జెట్ పరిమితంగా ఉండటంతో సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.