
- నేషనల్ పార్క్ ను చుట్టుముట్టిన కేంద్ర బలగాలు
- గణపతి,హిడ్మా, దేవా టార్గెట్ గా ఆపరేషన్ కగార్
- లొంగిపోతారా..? ఎన్ కౌంటరైపోతరా..?
- బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వార్నింగ్!
రాయ్ పూర్: బీజాపూర్ అడవుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ కగార్ లో భాగంగా 20 వేల మంది భద్రతా సిబ్బంది నేషనల్ పార్క్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతితోపాటు గెరిల్లా తంత్రాల్లో ఆరితేరిన పీఎల్‌జీ ఒకటో బెటాలియన్ కమాండర్ మాడ్వీ హిడ్మా, మరో అగ్రనేత దేవా టార్గెట్ గా మరో ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తోంది. బీజాపూర్ లోని దండకారణ్యంలో నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో 25 వేల బలగాలను మోహరించారని తెలుస్తోంది. పోలీసు బలగాలు మొత్తం ఆ ప్రాంతంపై పట్టు సాధించాయని చెబుతున్నారు.
అలానే నిన్న మధ్యాహ్నం జరిగిన స్వల్ప ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత సోంది కన్నా మృతి చెందారు. ఈ నేపథ్యంలో బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లొంగి పోతారా.. లేదంటే ఎన్‌కౌంటరై పోతారా అంటూ మావోయిస్టులకు ఆయన హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఈ కూంబింగ్ విషయంపై పౌర హక్కుల నేతల ఆందోళనలు కూడా దీనికి పరోక్షంగానే అవుననే సమాధానం చెబుతున్నాయి. నేషనల్‌పార్క్ ఆపరేషన్‌ను వెంటనే ఆపేయాలని తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేశారు. దీంతో ఏ క్షణమైనా ఎన్ కౌంటర్ జరగొచ్చని పౌరహక్కుల నేతలు టెన్షన్ పడుతున్నారు
►ALSO READ | heart attacks:సైలెంట్ హార్ట్ అటాక్..ఏ లక్షణాలు ఉండవు..చాలా డేంజర్..డాక్టర్లు ఏం చెబుతున్నారంటే