ఉగాండాలో పడవ బోల్తా.. 26 మంది మృతి

ఉగాండాలో పడవ బోల్తా.. 26 మంది మృతి
ఉగాండా ఘోర పడవ ప్రమాదం జరిగింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దులోని ఆల్బర్ట్ సరస్సులో జరిగిన ఈ పడవ ప్రమాదంలో 26 మంది మరణించారు. బలమైన గాలుల వల్ల పడవ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో పడవలో చాలామంది ప్రయాణిస్తున్నారని, వారిలో 26 మంది చనిపోగా.. స్థానికులు, పోలీసులు 21 మందిని రక్షించారని అధికారులు తెలిపారు. ఈ సరస్సులో ప్రమాదాలు జరగడం సర్వసాధారణమని ఒక అధికారి అన్నారు. భద్రతాలోపాలు మరియు వేగంగా మారుతున్న వాతావరణం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ఆయన అన్నారు. ఉగాండా నుంచి డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగోలోకి వచ్చేవారికి అనుమతుల లేకుండా నిబంధనలు విధించారు. కానీ, చాలామంది అక్రమంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగోలోకి ప్రవేశించడానికి ఇలా పడవ ప్రయాణాలను ఆశ్రయిస్తున్నారు. For More News.. దొంగల మధ్య గొడవ.. ఓ దొంగ గొంతుకోసి చంపిన మరో దొంగ రాష్ట్ర బీజేపీ నాయకుడిపై దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి డిప్యూటీ మినిష్టర్‌గా పిల్లి.. ఎందుకో తెలుసా?