తెలంగాణలో తొలగించిన 27 బీసీ కులాలను జాబితాలో చేర్చాలి

తెలంగాణలో తొలగించిన 27 బీసీ కులాలను జాబితాలో చేర్చాలి

కూకట్​పల్లి, వెలుగు: తెలంగాణలో బీసీ కులాల జాబితా నుంచి తొలగించిన 27 కులాలను తిరిగి లిస్టులో చేర్చాలని బీసీ యువసేన జాతీయ సమన్వయకర్త మురళీకృష్ణ డిమాండ్​ చేశారు. సోమవారం యువసేన ఆధ్వర్యంలో కూకట్​పల్లిలో ధర్నా నిర్వహించి వై జంక్షన్​ వద్ద అంబేద్కర్​ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్​ ప్రభుత్వం 27 బీసీ కులాలను జాబితా నుంచి తొలగిస్తూ జీవో నంబర్​ 3 జారీ చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్​ ఇచ్చిన హామీ ప్రకారం ఆ కులాలను తిరిగి జాబితాలో చేర్చాలన్నారు.

రిజర్వేషన్లు తేల్చాకే ఎన్నికలు పెట్టాలి..బీసీ విద్యార్థి సంఘం

ముషీరాబాద్, వెలుగు: జీవో నంబర్​ 46 రద్దు చేసి బీసీ రిజర్వేషన్లను తేల్చాకే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం విద్యానగర్ లో విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. సీఎం రేవంత్​రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.