హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 కేసులు నమోదు కాగా.. 12 మంది వలస కార్మికులు కరోనా బారిన పడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,661కి చేరింది. బుధవారం ఇద్దరు బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. ఇద్దరు చనిపోయారు. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1,013 మంది కోలుకున్నారు. 40 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 608 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

