కన్నడ రాక్ స్టార్ యశ్, గీతూ మోహన్ దాస్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం 'టాక్సిక్'. 'ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్' అనేది ట్యాగ్ లైన్ తో వస్తోంది. 'కేజీఎఫ్' లాంటి భారీ హిట్ తర్వాత యశ్ నటి స్తోన్న మూవీ కావడంతో దీనికోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్ బర్త్ డే సందర్భంగా ఆయన క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ ఇటీవల ఓ గ్లింప్స్ ను విడుదల చేశారు. అయితే అందులో శ్మశానం వద్ద కారులో కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో విమర్శలు వచ్చాయి.
లేటెస్ట్ గా ఈ విమర్శలపై డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ స్పందించింది. 'సమాజం ఇప్పటికీ మహిళల ఆనందం, వారి సమ్మతి, స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చల దశలోనే ఉంది. నేను మాత్రం ప్రశాంతంగా ఉన్న. మహిళా దర్శకురాలు ఇలాంటి సన్నివేశాలు తెరకెక్కించిందంటూ వస్తోన్న విమర్శ లు చూసి నేను చిల్ అవుతున్నాను అంటూ ఇన్ స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బహిరంగంగా ప్రశంసలు కురిపించగా, సోషల్ మీడియాలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి.
ఇక 'టాక్సిక్' విషయానికొస్తే.. ఇది ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యశ్ తో పాటు ఐదుగురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నదియా పాత్రలో కియారా కనిపించనుండగా హ్యుమా ఖురేషీ ఎలిజిబెత్, నయనతార గంగ పాత్రలో, రెబెకాగా తారా సుతారియా అలరించనున్నారు. మెలిసా అనే పాత్రలో రుక్మిణి వసంత్ ఆకట్టుకోనున్నారు. భారీ అంచనాలతో ఈ మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
