హైదరాబాద్: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లి చెక్ డ్యామ్‌లో పడి ముగ్గురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. బీహార్ నుంచి ఐదు రోజుల కిందటే బతుకుదెరువు కోసం కస్తూరిప్లలికి రెండు కుటుంబాలు వచ్చాయి.
ఈ క్రమంలో శనివారం (జనవరి 10) సాయంత్రం కిరని కుమార్ (12), బిర్జు (6) చెక్ డ్యామ్ దగ్గరకు స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తూ నీటిలో గల్లంతయ్యారు. గమనించిన ఉమా దేవి(32) వీరిని రక్షించబోయింది. ఈత రాకపోవడంతో ఆమె కూడా నీటిలో గల్లంతయ్యింది. చివరకు ముగ్గురు మృతి చెందారు.
►ALSO READ | హైదరాబాద్-కరీంనగర్ హైవేపై.. మారుతి 800 కారులో మంటలు.. ఫుల్ ట్రాఫిక్
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహయంతో ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో తల్లి కొడుకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయారా లేక మరేదేమైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
