ఏళ్ల కల నెరవేరింది.. రామాయంపేట నుంచి ఆ గ్రామాలకు ఆర్టీసీ బస్సు

ఏళ్ల కల నెరవేరింది.. రామాయంపేట నుంచి ఆ గ్రామాలకు ఆర్టీసీ బస్సు

నిజాంపేట, వెలుగు: చాలా ఏళ్లుగా ఆ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సేవలు నిలిపివేశారు. దీంతో  ఆయా గ్రామాల ప్రజలు, స్టూడెంట్స్ రామాయంపేటకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడేవారు. ఈ సమస్య ను ఎమ్మెల్యే రోహిత్ రావు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంత్ రావు దృష్టికి తీసుకువెళ్లగా వారు స్పందించి ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

ఈ మేరకు  రామాయంపేట మండలంలోని రాయిలాపూర్ నుంచి నిజాంపేట మండల పరిధిలోని తిప్పనగుళ్ల, బచ్చురాజ్ పల్లి, షౌకత్ పల్లి, నార్లాపూర్, కల్వకుంట గ్రామాల మీదుగా రామాయంపేటకు ఆర్టీసీ బస్సు సేవలు శుక్రవారం నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈ బస్సు సౌకర్యం కల్పించడం కోసం కృషి చేసిన కాంగ్రెస్ నాయకులు చింతల స్వామి, రంగ రాజకిషన్ ను గ్రామస్తులు 
అభినందించారు.