హైదరాబాద్: హైదరాబాద్-కరీంనగర్ ప్రధాన రహదారిపై పెను ప్రమాదం తప్పింది. శనివారం అలుగునూరు వంతెనపై వెళ్తున్న మారుతి 800 కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. గమనించిన ప్రయాణికులు వెంటనే దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కరీంనగర్పరిధిలో మొత్తం 41 బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. నుస్తులాపూర్, తిమ్మాపూర్, అలుగునూర్, సుల్తానాబాద్ మండల పరిధిలోని భూపతిపూర్, కాట్నపల్లి, దుబ్బపల్లి, గర్రెపల్లి, సుగ్లాంపల్లి, సుల్తానాబాద్ ఉన్నాయి. పెద్దపల్లి మండల పరిధిలో అప్పన్నపేట, పెద్ద కల్వల, రంగంపల్లి, శాంతినగర్, మంథని ఆర్ఓబీ, రాయపట్నం రోడ్, బంజేరుపల్లి, కటికనపల్లి, ధర్మారం క్రాస్ రోడ్.
►ALSO READ | మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. రూ.3 వేల కోట్లకు పైగా విలువైన భూమి సేఫ్
రామగుండం మండల పరిధిలో మేడిపల్లి సెంటర్, ఐఓసీ, బీ పవర్హైజ్, రామగుండం మున్సిపల్ ఆఫీస్ క్రాస్, గోదావరిఖని బస్టాండ్, గంగానగర్, పెద్దపల్లి నుంచి మంథని రోడ్‌లోని సబ్బితం ప్రాంతాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ స్పాట్లలో ఏటా పెద్ద సంఖ్యలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
