నేను వైద్యుడిని కాదు.. కానీ సోషల్ డాక్టర్‎ను: సీఎం రేవంత్ రెడ్డి

 నేను వైద్యుడిని కాదు.. కానీ సోషల్ డాక్టర్‎ను: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: నేను వైద్యుడిని కాదు కానీ సోషల్ డాక్టర్‎ని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం (జనవరి 10) హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఫెలోస్ ఇండియా  సదస్సు జరిగింది. ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్, ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‎గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైఫ్ సెన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని అన్నారు.

మనుషులు, సమాజంపై వైద్యులు తమ బాధ్యతను ఎప్పటికీ మరిచిపోవద్దని సూచించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. వైద్యులు అధునాతన సాంకేతికతను అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచించారు. గుండె జబ్బులను నివారించే మిషన్‎లో మనం భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు. 

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మనం కలిసి పని చేద్దామని కోరారు. విద్యార్థులకు సీపీఆర్ నేర్పేందుకు ముందుకు వస్తే చాలా మంది ప్రాణాలను కాపాడగలమని అన్నారు. క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ కోసం అందరూ కృషి చేయాలని.. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలోనే అత్యుత్తమం కావాలని సూచించారు.