సాయుధ దళాల కోసం రూ.724కోట్లతో 28 ప్రాజెక్టులు: రాజ్ నాథ్ సింగ్

 సాయుధ దళాల కోసం రూ.724కోట్లతో 28 ప్రాజెక్టులు: రాజ్ నాథ్ సింగ్

భారత సాయుధ బలగాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాయని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్న రాజ్ నాథ్ సింగ్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సియోమ్ వంతెనను ప్రారంభించారు. 

సున్నితమైన సరిహద్దు ప్రాంతాలలో భారత సాయుధ దళాల కదలికలు సులభతరం చేయడానికి రూ.724 కోట్ల వ్యయంతో 28 ప్రాజెక్టులు నిర్మించినట్లు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. దేశాల ప్రాధాన్యతలు, ఆసక్తులు ఎప్పటికప్పుడు మారతాయని చెప్పారు. ఏ దేశమైనా తనను తాను శక్తివంతంగా ఉంచుకోవడం అవసరమని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.