
సికింద్రాబాద్, వెలుగు ; హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో జరుగుతున్న ట్రాక్ మెయింటెన్స్ పనుల కారణంగా సికింద్రాబాద్నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 28 రైళ్లను సోమవారం నుంచి ఈనెల 26 వరకు రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ఆఫీసర్లు ఆదివారం వెల్లడించారు. కా: జీపేట–డోర్నకల్–-కాజీపేట, డోర్నకల్-–విజయవాడ, భద్రాచలం-–విజయవాడ, సికింద్రాబాద్–-వికారాబాద్,వికారాబాద్– కాచిగూడ, సికింద్రాబాద్–-వరంగల్, వరంగల్– హైదరాబాద్, సిర్పూర్ టౌన్–కరీంనగర్, నిజామాబాద్–- కరీంనగర్, వాడీ–-కాచిగూడ, కాజీపేట్– సిర్పూర్ టౌన్, బల్లార్షా-–కాజీపేట, ఫలక్ నుమా-–వాడీ, కాజీపేట–- బల్లార్షా, కాచిగూడ– నిజామాబాద్-, కాచిగూడ–- నడికుడి- మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ నెల 25 వరకు రద్దు చేశారుసికింద్రాబాద్, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో జరుగుతున్న ట్రాక్ మెయింటెన్స్ పనుల కారణంగా సికింద్రాబాద్నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 28 రైళ్లను సోమవారం నుంచి ఈనెల 26 వరకు రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ఆఫీసర్లు ఆదివారం వెల్లడించారు. కాజీపేట–డోర్నకల్–-కాజీపేట, డోర్నకల్-–విజయవాడ, భద్రాచలం-–విజయవాడ, సికింద్రాబాద్–-వికారాబాద్, వికారాబాద్– కాచిగూడ, సికింద్రాబాద్–-వరంగల్, వరంగల్– హైదరాబాద్, సిర్పూర్ టౌన్–కరీంనగర్, నిజామాబాద్–- కరీంనగర్, వాడీ–-కాచిగూడ, కాజీపేట్– సిర్పూర్ టౌన్, బల్లార్షా-–కాజీపేట, ఫలక్‌నుమా-–వాడీ, కాజీపేట–- బల్లార్షా, కాచిగూడ– నిజామాబాద్-, కాచిగూడ–- నడికుడి- మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ నెల 25 వరకు రద్దు చేశారు. కరీంనగర్–సిర్పూర్ టౌన్, నిజామాబాద్–కరీంనగర్, భద్రాచలం-–బల్లార్షా, బల్లార్షా–కాజీపేట మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ నెల 20 నుంచి 26 వరకు రద్దు చేశారు.
25 వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లు..
ట్రాక్మెయింటెన్స్, ఇతర మౌళిక సదుపాయాల ఏర్పాటులో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 25 వరకు 23 ఎంఎంటీఎస్సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-–హైదరాబాద్, హైదరాబాద్–-లింగంపల్లి, లింగంపల్లి–-ఫలక్‌నుమా, లింగంపల్లి–-ఉమ్దానగర్, ఫలక్‌నుమా– -లింగంపల్లి మధ్య నడిచే 17 ఎంఎంటీఎస్సర్వీసులను 24 వరకు, అలాగే ఉమ్దానగర్–- లింగంపల్లి, రామచంద్రాపురం– ఫలక్‌నుమా, ఫలక్‌నుమా– లింగంపల్లి స్టేషన్ల మధ్య నడిచే మరో 6 ఎంఎంటీఎస్ రైళ్లను 25 వరకు రద్దు చేశారు.