కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ బాంబు దాడులు.. సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన బ్యాంకులు

కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ బాంబు దాడులు.. సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన బ్యాంకులు

కువైట్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు మూసివేశారు. విమానాశ్రయంలోని ఆయిల్ నిల్వల ట్యాంకుల లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ బాంబులు వేసింది. ఇరాన్ డ్రోన్ బాంబులు సరిగ్గా.. ఎయిర్ పోర్టులోని ఆయిల్ డిపోలోని ట్యాంకులను ఢీకొట్టాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భద్రతా సిబ్బంది వేగంగా స్పందించటంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇరాన్ డ్రోన్ దాడులతో.. కువైట్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు బంద్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

గురువారం (మార్చి 12) ఇరాన్ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా డ్రోన్స్ తో దాడి చేసింది. దీంతో విమానాశ్రయం స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది. ఇరాన్ దాడితో కువైట్ లోని సిటీ బ్యాంకును తాత్కాలికంగా మూసివేశారు. యూఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా ఉద్రిక్తతలు మరింతగా పెరిగిపోతుండటంతో బ్యాంకు ఆపరేషన్స్ ను ఆపేస్తున్నట్లు సిటీ బ్యాంక్ ప్రకటించింది. 

ఎయిర్ పోర్టులోని ఆయిల్ నిల్వలున్న ట్యాంకులపై డ్రోన్స్ దాడి జరిగినట్లు కువైట్ అధికారులు తెలిపారు. మరిన్ని డ్రోన్స్ అటాక్ చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. అందుకోసం ఎయిర్ స్పేస్ పై నిఘా ఉంచామన్నారు. 

ఈ దాడిలో ఎయిర్ పోర్ట్ వర్కర్లు కొందరు స్వల్పంగా గాయపడినట్లు సిబ్బంది పేర్కొంది. ఆయిల్ ట్యాంకుల దగ్గర ఉన్న సిబ్బంది చిన్న చిన్న గాయాలతో బయట పడినట్లు తెలిపారు గాయపడినవారికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సెక్యూరిటీని పెంచి ఎయిర్ పోర్టు లో మిగతా సేవలు కొనసాగిస్తున్నారు. 

గల్ఫ్ దేశాలు అమెరికాకు మద్ధతు ఇస్తున్నాయన్న కారణంగా చుట్టుపక్కల ఉన్న దేశాలను టార్గెట్ చేస్తోంది ఇరాన్. ఒకవైపు యూఎస్, ఇజ్రాయెల్ లను ఎదుర్కొంటూనే పొరుగు దేశాలపై అటాక్ చేస్తోంది. అందులో భాగంగానే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై దాడి చేసింది ఇరాన్.