సింగరేణిలో ఈరోజు నుండి 3 రోజుల సమ్మె

సింగరేణిలో ఈరోజు నుండి 3 రోజుల సమ్మె

సింగరేణిలో ఈరోజు నుండి 3 రోజుల సమ్మె.
పాల్గొననున్న 46 వేల మంది కార్మికులు
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం
నిలిచిపోనున్న బొగ్గు ఉత్పత్తి, రవాణా

బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు గురువారం నుండి 3 రోజుల పాటు సమ్మెలో పాల్గొననున్నారు. కోల్‌ ఇండియా,సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇప్పటికే యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చాయి. దేశవ్యాప్తంగా 50 బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, కార్మిక చట్టాల సవరణను వెనక్కితీసుకోవాలని ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎ్‌స, సీఐటీయూ, బీఎంఎస్‌, ఇఫ్టూ తదితర సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సింగరేణిలోని కాంట్రాక్టు కార్మికులందరికీ హెచ్‌పీసీ వేతనాలు ఇవ్వాలని కూడా వారు కోరుతున్నారు.

ప్రధాన సంఘాలన్నీ సమ్మెలో ఉండనుండటంతో 19 ఓపెన్‌కాస్టులతో పాటు 45 మైన్‌లలో బొగ్గు ఉత్పత్తి, రవాణా నిలిచిపోనుంది. దాదాపు 46 వేల మంది ఈ సమ్మెలో పాల్గొనే అవకాశముంది. సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లోని 12 ఏరియాల్లో సమ్మెను విజయవంతం చేసేలా కార్మిక సంఘాలు బుధవారం విస్తృతంగా ప్రచారం చేశాయి. టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ గురువారం ఒక్కరోజు మాత్రమే సమ్మెకు పిలుపునిచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం