
న్యూఢిల్లీ: ఈ ఏడాది యూనికార్న్‌ల లిస్ట్‌లో కేవలం మూడు ఇండియన్ స్టార్టప్‌లే జాయిన్ అయ్యాయని హురున్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. క్విక్ కామర్స్ స్టార్టప్ జెప్టో, ఫిన్‌టెక్ స్టార్టప్ ఇన్‌క్రెడ్ ఫైనాన్స్, లాజిస్టిక్స్ స్టార్టప్ పోర్టర్ యూనికార్న్ లిస్టులో చేరాయని తెలిపింది. వాల్యుయేషన్ ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉన్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా పిలుస్తారు. మరోవైపు హురున్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ ఇండెక్స్ నుంచి ఏకంగా 25 ఇండియన్ స్టార్టప్‌లు తప్పుకున్నాయి.
2000 సంవత్సరం తర్వాత ఏర్పడి, బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉన్న స్టార్టప్‌లను యూనికార్న్‌ల లిస్ట్ కోసం హురున్ పరిగణనలోకి తీసుకుంది. వచ్చే మూడేళ్లలో యూనికార్న్‌లుగా మారే స్టార్టప్‌లు గజెల్జ్, వచ్చే ఐదేళ్లలో యూనికార్న్‌లుగా మారే స్టార్టప్‌లు చీతాస్ లిస్ట్‌ను కూడా హురున్ ఇండియా విడుదల చేసింది. హెచ్‌ఆర్ టెక్ స్టార్టప్ డార్విన్‌బాక్స్ యూనికార్న్ లిస్ట్ నుంచి గజెల్జ్ లెవెల్‌కు పడిపోయింది.
లీప్ స్కాలర్, మనీవ్యూ, కంట్రీ డెలైట్ ఈ ఏడాది అత్యంత విలువైన గజెల్జ్‌గా నిలిచాయి. జస్‌పే అత్యంత విలువైన చీతాగా నిలిచింది. ప్రస్తుతం ఇండియాలో 67 యూనికార్న్‌లు, 46 గజెల్జ్, 106 చీతాస్ స్టార్టప్‌లు ఉన్నాయి. కిందటేడాది 68 యూనికార్న్‌లు, 51 గజెల్జ్, 96 చీతాస్ స్టార్టప్‌లు నమోదయ్యాయి.