కూలీలకు కేంద్రం అండ

కూలీలకు కేంద్రం అండ

లాక్ డౌన్ నేపథ్యంలో కూలీలు, వలస కార్మికుల సంక్షే మం కోసం చేపడుతున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. పేదలకు అండగా నిలిచేందుకు పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద 15 కిలోల బియ్యం, మూడు కిలోల పప్పు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. భవన నిర్మాణ కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ లో  ఉన్న రూ.31 వేల కోట్లు వాడుకోవచ్చని స్పష్టం చేసింది. తాజాగా ఏ ఒక్క కూలీకి ఇబ్బంది లేకుండా చూసేందుకు దేశవ్యాప్తంగా 19 కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది. కూలీలు, వలస కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. రిలీఫ్ క్యాంపుల నిర్వహణ పక్కాగా జరగాలని సూచించింది. హైదరాబాద్ రీజినల్ లేబర్ ఆఫీసుకు సంబంధించి ఒక రీజినల్ లేబర్ కమిషనర్ వి.టి.థామస్(9496204401), ఇద్దరు అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు పి.లక్ష్మణ్(8328504888), ఎ. చతుర్వేది(8552008109)లకు కంట్రోల్ రూంకు వచ్చే కంప్లయింట్లను పరిష్కరించే డ్యూటీని అప్పగించారు. అలాగే ఉపాధి లేని ప్రస్తుత పరిస్థితుల్లో వారికి సాయం చేసేందుకు అవసరమైన వివరాలను సేకరించాలని కేంద్రం సూచించింది. కూలీలు, వలస కార్మికులు కలిపి దేశంలో 40 కోట్ల మంది ఉంటారని కేంద్ర ప్రభుత్వం అంచనా. వీరందరికీ ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ చీఫ్ లేబర్ కమిషనర్ రాజన్ వర్మ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చారు. కూలీల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి పంపించాలని పేర్కొంటూ ఒక ఫార్మాట్ ను పంపించారు.

ఈ విధుల నిర్వహణ కోసం రీజనల్ లేబర్ కమిషన్లు లేదా అసిస్టెంట్ లేబర్ కమీషనర్లలో ఒకరిని నోడల్ ఆఫీసర్ గా నియమించాలని ఆదేశించారు. బిల్డింగ్ కన్స్ర్ట క్షన్, హోటల్‌‌‌‌– ఫుడ్ సర్వీస్,  మైనింగ్ , ట్రాన్స్ పోర్టేషన్  – స్టోరేజ్, ఐటీ–కమ్యూనికేషన్, హోల్ సేల్– రిటేల్ , మాన్యు ఫ్యాశ్చరింగ్ , ఆర్టికల్చరల్ ,  వాటర్ సప్లై – పారిశుద్ధ్యం , ఈ కామర్స్(డెలివరీ బాయ్స్), ఇంట్లో పని చేసేవారు వంటి వివరాలను స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న రంగాలకు సంబంధించి మన రాష్ట్రంలో దాదాపు కోటి మంది, ఇతర రాష్ట్రాలకు చెందినవా రు 10 లక్షల మంది ఉన్నారు. మూడు రకాల క్యాంపులు కూలీల వివరాల సేకరణ ప్రక్రియలో భాగంగా క్యాంపులను మూడు రకాలుగా విభజించాలని కేంద్ర కార్మిక శాఖ సూచించింది. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపులలో ఉన్నవారు, సొంత ప్రదేశాల్లో పని చేసేవారు, స్థానికంగా వేరే ప్రాంతానికి వెళ్లిపని చేసేవారు… ఇలా మూడు కేటగిరీలలో క్యాంపుల లిస్ట్తయారు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం, ఎన్జీవోలు ప్రైవేటు యజమానులు ఏర్పాటు చేసిన  రిలీఫ్ క్యాంపులలో ఉన్న కూలీల వివరాలను సైతం సేకరించాలని పేర్కొన్నారు.