
ఈ జూన్ రెండో వారం (జూన్ 9-15) సినిమాల సందడి మాములుగా లేదు. థియేటర్లో సినిమాలు పెద్దగా రీలిజ్ కాకపోయినా, ఓటీటీలోకి మాత్రం 30కి పైగా మూవీస్ వచ్చాయి. అందులో యాక్షన్ థ్రిల్లర్స్, హారర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి డిఫెరెంట్ జోనర్స్ సినిమాలున్నాయి. మరి ముఖ్యంగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేలా 15కి పైగా తెలుగు సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వారం ఆసక్తికరంగా వచ్చిన ఆ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి? అనే వివరాలు చూసేద్దాం.
నెట్‌ఫ్లిక్స్:
రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 13
ఆహా:
కార్తిక మిస్సింగ్ కేస్ (తెలుగు మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)- జూన్ 13
అమెజాన్ ప్రైమ్:
లెవెన్ (తెలుగు, తమిళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)- జూన్ 13
బ్లైండ్ స్పాట్ (తెలుగు మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్)- జూన్ 13
ఏస్ (తెలుగు, తమిళ రొమాంటిక్ క్రైమ్ కామెడీ)- జూన్ 13
ఫ్లైట్ రిస్క్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్)- జూన్ 13
జియో హాట్‌స్టార్:
శుభం (తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్)- జూన్ 13
కేసరి చాప్టర్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా )- జూన్ 13
పడక్కలమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీ)- జూన్ 10
సోనీ లివ్:
అలప్పుళ జింఖానా (తెలుగు డబ్బింగ్ మలయాళ స్పోర్ట్స్ కామెడీ)- జూన్ 12
జీ5:
డెవిల్స్ డబుల్ నెక్ట్స్ నెక్ట్స్ లెవెల్ (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ కామెడీ)- జూన్ 13
సన్ నెక్ట్స్:
డియర్ ఉమ (తెలుగు మెడికల్ రొమాంటిక్ డ్రామా)- జూన్ 13
లయన్స్ గేట్ ప్లే:
ది ప్రాసిక్యూటర్ (తెలుగు డబ్బింగ్ చైనీస్ యాక్షన్ థ్రిల్లర్)- జూన్ 13
ఈ సినిమాలన్నిటిలో.. లెవెన్, రానా నాయుడు 2, శుభం, బ్లైండ్ స్పాట్, కార్తిక మిస్సింగ్ కేస్, డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్, డియర్ ఉమ, ది ప్రాసిక్యూటర్, కేసరి చాప్టర్ 2, ఆ ఒక్కటి అడక్కు, ఏస్, జోడీ, ఫ్లైట్ రిస్క్, క్లీనర్, మామన్, హెమ్‌లాక్ సొసైటీ మూవీస్ స్పెషల్ గా ఉండనున్నాయి. ఇందులో మరీముఖ్యంగా నవీన్ చంద్ర నటించిన లెవెన్ మూవీ క్రైమ్ జోనర్లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో వచ్చింది. హార్రర్ జోనర్లో DD నెక్స్ట్ లెవెల్, శుభం సినిమాలున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రానా నాయుడు 2, ఫ్లైట్ రిస్క్ స్ట్రీమ్ అవుతున్నాయి. ది ప్రాసిక్యూటర్, కేసరి చాప్టర్ 2 సినిమాలు.. ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామాతో ఆసక్తి పెంచుతున్నాయి.