
హైటెక్ యుగంలో జనాలు ఆన్ లైన్ ను ఎంతగా ఉపయోగించుకుంటున్నారంటే.. మార్నింగ్ టిఫెన్ .. కూరగాయలు.. ఇలా ఒకటేమిటి ప్రతి వస్తువును కూడా కాలు బయట పెట్టకుండా తెప్పించుకుంటున్నారు. ఆన్లైన్ లో విక్రయించేందుకు పలు రకాల యాప్లు అందుబాటులో ఉన్నాయి. అలానే ఓ మహిళ జెప్టోయాప్ లో కోడిగుడ్లను ఆర్డర్ చేసింది. ఇంతవరకూ బాగానే ఉంది.
జెప్టో యాప్‌కు షాకింగ్అనుభవం ఎదురైంది. ఆన్లైన్ లో కోడిగుడ్డును కొన్న తరువాత ఉడికించింది. అందులో నుంచి ఒక నల్లటి ద్రవం వచ్చింది. అంతేకాదు అందులో తెల్లటి పురుగులు కూడా ఉన్నాయని కుళ్లిన పుచ్చకాయను కూడా వీడియోలో చూపించింది. ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్ అయింది. ఇది చూసే వారికి వాంతులు అయ్యే విధంగా ఉంది.
మహారాష్ట్రలోని జెప్టో గిడ్డంగి పాడైపోయిన.. కుళ్లిపోయిన ఆహార పదార్థాలను ఆన్ లైన్ లో విక్రయి
స్తుందని ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ఈ వీడియో వైరల్ కావడంతో లైసెన్స్ రద్దు చేశారు.
జెప్టో గిడ్డంగి ఇటీవల చెడు నిల్వ పరిస్థితులకు గురైంది, దీని ఫలితంగా దాని లైసెన్స్ నిలిపివేయబడింది.
బాధిత మహిళ ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్‌లో .. ఇలాంటి కోడిగుడ్డును అమ్మేందుకు జెప్టో నిర్వాహకులకు ఎలా ఆమోదయోగ్యమని ప్రశ్నించింది. ఇకనైనా ప్రజలను మోసం చేయడం ఆపండి .. రీ ఫండ్ చేయడం.. క్వాలిటీపై దృష్టి పెట్టకపోవడం ఎంతవరకు సమంజసం .. బ్రో అంటూ.. జెప్టో యాప్ లో పండ్లు ... గుడ్లు ఆర్డర్ చేయడం ఆపేయండి అని బాధిత మహిళ రాశారు.
ఈ వైరల్ వీడియోను ayushii.prasad అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ అయింది. ఈ వీడియోకు 3.8 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. వీడియో వైరల్ అయిన తర్వాత... Zepto కూడా వీడియోపై స్పందిస్తూ... మీ అసౌకర్యాన్ని.. ఆదోళనను అర్దం చేసుకున్నాం.. మీ ఆర్డర్ వివరాలను మాకు పూర్తిగా తెలియజేయండి.. మీకు సహాయం చేస్తామన్నారు.
ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. తాజా బ్రెడ్ కోసం ఆర్డర్ చేస్తే గడువు ముగిసే రోజు బ్రెడ్ వచ్చింది.. బ్రో.. నేను రొట్టె కావాలన్నాను కాని.. అదే నాకు వీడ్కోలు చెప్పే పార్టీ కాదు స్పందించిన యూజర్ చివరిశ్వాశలో ( జీవితం లాస్ట్‌మినిట్‌లో) తినాలంటే అప్పుడు మీకు ఆర్డర్ పెడతాను లే అని వ్యంగ్యంగా స్పందించారు,
జెప్టో అంటే ఇ-కామర్స్ నాప్టోల్ అని ఒక వినియోగదారు రాశారు. ఫ్రెష్ అంటే ఎక్స్‌పెయిరీ గంటలు కాదు... రోజులు ఉండాలన్నారు . ఇంకొకరు ఈ యాప్ ను ఇప్పుడే అన్‌ఇన్‌స్టాల్ చేశాను. నాకు Rs. 100rs క్యాష్‌బ్యాక్ వచ్చిందనే నోటిఫికేషన్ పదే పదే రావడంతో చాలా డిస్టబ్ అవుతున్నారు. మరొకరు ఇది పూర్తిగా నకిలీ యాప్ అని స్పందించారు. జెప్టోతో రెండుసార్లు సమస్యలను ఎదుర్కొన్నానని నాలుగో వ్యక్తి రాశారు . క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది సరిగా లేకపోతే భారీ గా కష్టమర్లు కోల్పోతారని రాసుకొచ్చారు.