కేరళలో బ్రిటన్ యుద్దవిమానం ఎఫ్–35 ఎమర్జన్సీ ల్యాండింగ్

కేరళలో బ్రిటన్ యుద్దవిమానం ఎఫ్–35  ఎమర్జన్సీ ల్యాండింగ్

విమానం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఇలాంటి పదాలు మీడియాలో కనిపిస్తుంటే చాలా మందిలో టెన్షన్ నెలకొంటుంది. తాజాగా కేరళలో యూకేకు  చెందిన యుద్ద విమానం ఫైటర్​ జెట్​ ఎఫ్​–35  కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానశ్రయంలో ఎమర్జన్సీ ల్యాండింగ్​ కలకలం రేపింది.  దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

 హిందూ మహాసముద్రంపై ప్రయాణిస్తున్న సమయంలో.. ఆ విమానంలోని ఇంధనం తగ్గిపోవడంతో ఎమర్జెన్సీ ల్య్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది.శనివారం ( జూన్​ 14)  రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో ఐదో తరానికి చెందిన ఈ స్టెల్త్‌ ఫైటర్ జెట్‌.. యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన "హెచ్‌.ఎమ్‌.ఎస్‌. ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌" క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ లో భాగంగా చెబుతున్నారు. ఇది ప్రస్తుతం ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోంది. ఈ యుద్ధ విమానం భద్రంగా కేరళలో ల్యాండ్ అయ్యిందని తెలిపారు. అయితే ఇది విదేశీ యుద్ధ విమానం, దేశ భద్రతకు సంబందించిన విషయం కనుక ఈ విషయం రక్షణశాఖకు తెలియజేసినట్లు తెలిపారు.

తక్కువ ఇంధనం ఉందని.. ల్యాండ్ చేయడానికి అనుమతి ఇవ్వాలని పైలట్ కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం విమానం విమానాశ్రయంలోనే నిలిపి ఉంచామని.. సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులు అవసరమైన అనుమతి మంజూరు చేసిన తర్వాత ఇంధనం నింపడం జరుగుతుందని వర్గాలు తెలిపాయి. . ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో కలిసి యుద్ధ విన్యాసాలు కూడా చేసింది.