
కేంద్రమంత్రి జయంత్ చైదరి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు సీఎం రేవంత్.
రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు కేంద్ర మంత్రి. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందన్న కేంద్ర మంత్రి జయంత్ చౌదరి చెప్పారు. జూన్ 16న కౌశల్ మందన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి.
ALSO READ | ప్రభుత్వ స్కూళ్లలో సాంకేతిక విద్య.. ఆరు NGOలతో ఎంవోయూ
యువతలో నైపుణ్యాలను పెంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే.తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్‌పర్సన్‌గా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా.. కో చైర్మన్‌గా విద్యావేత్త శ్రీనివాస్ సి. రాజును రాష్ట్ర సర్కారు నియమించిన సంగతి తెలిసిందే..