ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఢాకా సమీపంలోని పూర్బాచ ల్ న్యూ టౌన్ ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను కేటాయించారనే ఆరోపణల కేసులో ఆమెను దోషిగా నిర్థారించింది. దీంతో ఆమెకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించింది. ఢాకాలోని స్పెషల్ జడ్జ్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
ఒక్కో కేసులో ఐదేళ్ల చొప్పున మొత్తం 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇదే కేసులో షేక్ హసీనా మేనకోడలు, బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిక్ కు 4 ఏళ్ల జైలు శిక్ష విదించింది. హసీనా కొడుకు, కోడలకు చేరో 7 ఏళ్ల చప్పున జైలు శిక్ష విధిస్తు తీ ర్పునిచ్చింది. మరో మేనకోడలు అజ్మినా సిద్ధిఖ్, మేనల్లుడు రద్వాన్ ముజిబ్ సిద్దిఖ్ లకు ఒక్కొక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.
