30 కోట్ల మంది పాన్‌‌-ఆధార్‌‌‌‌ లింకయ్యాయి

30 కోట్ల మంది  పాన్‌‌-ఆధార్‌‌‌‌ లింకయ్యాయి

మార్చి 31 వరకు పొడిగించడంతో నెంబర్ పెరిగే అవకాశం
ఆధార్‌ -బ్యాంక్ అకౌంట్‌ లింకింగ్‌ 85 శాతం పూర్తయ్యింది: అనురాగ్‌ ఠాకూర్‌

న్యూఢిల్లీ: దేశంలోని 30 కోట్లకు పైగా పాన్‌‌ నెంబర్లు, యూనిక్‌‌ ఐడెంటిటీ నెంబర్‌‌‌‌ ఆధార్‌‌‌‌తో లింక్‌‌ అయ్యాయని ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్‌‌ ఠాకూర్‌‌‌‌ సోమవారం పార్లమెంట్‌‌లో తెలిపారు. పాన్‌‌ను ఆధార్‌‌‌‌తో లింక్ చేయమని గతేడాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పాన్–ఆధార్‌‌‌‌ లింక్‌‌ డేట్‌‌ను మరో మూడు నెలలు పొడిగించడంతో మరికొన్ని పాన్‌‌ కార్డులు, ఆధార్‌‌‌‌తో లింక్‌‌ అవుతాయన్నారు.  జనవరి 27, 2020 నాటికి మొత్తంగా 30,75,02,824 పాన్‌‌ నెంబర్లు, ఆధార్‌‌‌‌ నెంబర్‌‌‌‌తో లింక్ అయ్యాయని తెలిపారు. ఈ లింకింగ్‌‌కి డెడ్‌‌లైన్‌‌ను పెంచామన్నారు. డిసెంబర్‌‌‌‌ 31, 2019 తో ముగియాల్సిన ఈ ప్రోసెస్‌‌ను, మార్చి 31,2020 కి పొడిగించామన్నారు. ఇప్పటి వరకు ఆధార్‌‌‌‌ నెంబర్‌‌‌‌తో లింక్‌‌ చేయని పాన్‌‌ హోల్డర్లకు ఈ పొడిగింపు ఉపయోగపడుతుందని తెలిపారు.  పాన్‌‌– ఆధార్‌‌‌‌ లింకింగ్‌‌ సంస్థలు యూనిక్‌‌ ఐడెంటిఫికేషన్‌‌ అథారిటీ ఆఫ్‌‌ ఇండియా(యూఐడీఏఐ) గైడ్‌‌ లైన్స్‌‌ ప్రకారం నడుచుకుంటాయన్నారు. అందువలన డేటా రహస్యంగా ఉంటుందని హామి ఇచ్చారు.  దీనికోసం ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ చట్టం, ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ చట్టాలను అనుసరించి ప్రభుత్వం సరియైన చర్యలను తీసుకుంటోందన్నారు. పాన్‌‌–ఆధార్‌‌‌‌ వలన బినామి ప్రాపర్టీలు వెలుగులోకి వస్తాయని, పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. రూ. 10 లక్షలను దాటిన ఏదైనా స్థిరాస్తి కొనడం లేదా అమ్మడంలో పాన్‌‌ నెంబర్‌‌‌‌ను కచ్చింతంగా వాడాలన్న విషయం తెలిసిందే.

85 శాతం పూర్తయిన పాన్‌‌-బ్యాంక్ అకౌంట్స్‌‌ లింకింగ్‌‌

జనవరి 24,2020 నాటికి దేశంలోని 85 శాతం కరెంట్‌‌, సేవింగ్స్‌‌ అకౌంట్లు ఆధార్‌‌‌‌తో లింక్‌‌ అయ్యాయని ఠాకూర్‌‌‌‌ అన్నారు.  డిసెంబర్‌‌ 31,2019 నాటికి 59.15 కోట్ల రూపే కార్డులను బ్యాంకులు ఇష్యూ చేశాయని నేషనల్‌‌ పేమెంట్స్‌‌ కార్పొరేషన్‌‌ ఇండియా(ఎన్‌‌సీపీఐ)  తెలిపింది.