
30 మంది హాస్పిటల్లో చేరిక
ఎల్లారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని ట్రైబల్ హాస్టల్లో ఫుడ్పాయిజనింగ్తో 30 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. గర్ల్స్ ట్రైబల్ స్కూల్ లో 6 నుంచి ఇంటర్ వరకు దాదాపు 500 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. శుక్రవారం రాత్రి హాస్టల్లో అన్నం, బెండకాయ కూర పెట్టారు. భోజనం చేసిన తర్వాత దాదాపు 30 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఎల్లారెడ్డి గవర్నమెంట్హాస్పిటల్కు తరలించారు.
శనివారం డాక్టర్వెంకటస్వామి స్కూల్లో స్టూడెంట్లకు పరీక్షలు నిర్వహించారు. మరో 20 మంది అస్వస్థతకు గురైనట్లు తేలింది. రాత్రి సమయంలో వండిన భోజనం, నీటి వల్ల ఇలా జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది నీటి శాంపిల్స్సేకరించారు.