IND vs BAN: ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం.. 

IND vs BAN: ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం.. 

IND vs BAN: మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ ట్రోఫీని భారత్ వరుసగా రెండో సీజన్ లోనూ సొంతం చేసుకుంది. బ్యాంకాక్ వేదికగా జరిగిన 2026 ఎడిషన్ లో భారత-ఏ జట్టు విజేతగా నిలిచింది. ఇవాళ (ఫిబ్రవరి 22) జరిగిన ఫైనల్లో టీమిండియా 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్-ఏపై గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ టోర్నమెంట్ తొలి ఎడిషన్ (2023) ఫైనల్లోనూ భారత-ఏ టీం బంగ్లా-ఏపైనే గెలిచి టైటిల్ ని దక్కించుకుంది.  

కాగా ఇవాళ్టి ఫైనల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. తేజల్ హసబ్నిస్ (51 నాటౌట్), కెప్టెన్ రాధా యాదవ్ (36) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగుల చేసింది. వీరిద్దరితో పాటు భారత బ్యాటర్ వ్రింద దినేశ్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేసింది. మిగతా బ్యాటర్లలో నందిని కశ్యప్ 8, అనుష్క శర్మ 8, తనూజా కన్వర్ 1, ప్రేమా రావత్ 4, మిన్నూ మణి (0) దారుణంగా విఫలమయ్యారు. మమత మడివాలా 2 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.

బంగ్లాదేశ్ బౌలర్ ఫాహిమ ఖాతూన్ (4) అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా బ్యాటర్లనున కట్టడి చేసింది. మరో బౌలర్ ఫాతిమా జహా సోనియా (1) పొదుపుగా బౌలింగ్ చేయగా, ఫర్జానా ఎస్మిన్ (1) పర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో సంజిద అక్తర్, ఫరీహా త్రిస్న, లతా మొండల్, సదియా అక్తర్, అద్భుతంగా బౌలింగ్ చేశారు. అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్-ఏ జట్టు తడబడింది. 

టీమిండియా బౌలర్లు ప్రేమా రావత్ (3), తనూజా కన్వర్ (2), సోనియా మెంధియా (2), కెప్టెన్ రాధా యాదవ్ (1), సైమా ఠాకోర్ (1), మిన్నూ మణి (1) ధాటికి 19.1 ఓవర్లలో 88 రన్స్ కే బంగ్లాదేశ్–ఏ జట్టు ఆలౌట్ కావడంతో ట్రోఫీని కోల్పోయింది. బంగ్లా ఇన్నింగ్స్ 20 రన్స్ చేసిన షమీమా సుల్తానా టాప్ స్కోరర్ గా నిలిచింది. సర్మిన్ సుల్తానా (18), కెప్టెన్ ఫాతిమా ఖాతూన్ (14), సదియా అక్తర్ (10) చాలా  కష్టంగా రెండంకెల స్కోర్లు చేశారు. ప్రేమా రావత్ 3 వికెట్లు తీయడంతో పాటు 3 క్యాచులను పట్టుకుని టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది.