కరోనాతో బ్రెజిల్‌లో ఒక్కరోజే 3వేల మంది మృతి

కరోనాతో బ్రెజిల్‌లో ఒక్కరోజే 3వేల మంది మృతి

రియోడెజినిరో: బ్రెజిల్ లో కరోనా విలయం సృష్టిస్తోంది. వైరస్ తో మంగళవారం ఒక్కరోజే 3,251 మంది చనిపోయినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క సావోపాలో సిటీలోనే 1,021 మంది మరణించినట్లు తెలిపింది. ఒకేరోజు ఇంతమంది చనిపోవడం ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పింది. దేశవ్యాప్తంగా 84వేలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు బ్రెజిల్ సర్కార్ వెల్లడించింది. కేసులు పెరుగుతుండడంతో అన్ని హాస్పిటళ్లలో ఐసీయూ బెడ్స్ నిండిపోయాయి. బ్రెజిల్ లో మొత్తం మరణాలు 2,99,000 కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలు నమోదైన దేశాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది. కరోనాను నియంత్రించడంలో అధ్యక్షుడు బొల్సనారో విఫలమయ్యారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. లాక్ డౌన్ విధించపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని ఆరోపించాయి. కాగా, ఆ దేశ కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా కార్డియాలజిస్ట్ మెర్సిలో బాధ్యతలు చేపట్టారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ముగ్గురు మంత్రులు మారారు.