
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మైనారిటీ అఫైర్స్ శాఖకు బడ్జెట్ లో రూ.3,183.24 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్ లో రూ.2,608.93 కోట్లను కేటాయించగా ప్రస్తుతం రూ.574.31 కోట్లను అధికంగా అలాకేట్ చేసింది. ఈ నిధుల్లో ఎడ్యుకేషన్ ఎంపవర్ మెంట్ కోసం రూ.1,575.72 కోట్ల కేటాయింపులు జరిపింది. బడ్జెట్ ప్రతిపాదనల్లో మైనారిటీల ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం రూ.326.16 కోట్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం రూ.1,145.88 కోట్లను కేటాయించింది.
మైనారిటీ మంత్రిత్వ శాఖ ప్రధాన పథకాలు, ప్రాజెక్టుల కోసం రూ.2,120.72 కోట్లను అలాకేట్ చేసింది. మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యక్రమాలలో ఒక్కటైన ‘ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం’ కోసం ఈ సారి రూ.910.90 కోట్ల నిధుల కేటాయింపులు జరిపింది.