
CRPF జవాను ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. అనంత్‌నాగ్‌లో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ 33ఏళ్ల ఎం. అర్వింద్ ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం రాత్రి అర్వింద్ తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. 2014లో CRPF లో అర్వింద్ చేరారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.