బీచ్‌కి కొట్టుకొచ్చిన 35 అడుగుల భారీ తిమింగలం

బీచ్‌కి కొట్టుకొచ్చిన 35 అడుగుల భారీ తిమింగలం

న్యూయార్క్‌లోని నాసావు కౌంటీలోని లాంగ్ ఐలాండ్‌లోని లిడో బీచ్‌లో 35 అడుగుల పొడవున్న మగ హంప్‌బ్యాక్ తిమింగలాన్ని అధికారులు గుర్తించారు. ప్రకారం, పదేళ్లలో తాను చూసిన అతిపెద్ద తిమింగలం ఇదేనని హెంప్‌స్టెడ్ పట్టణ పర్యవేక్షకుడు డాన్ క్లావిన్ తెలిపారు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలం చూసి కనీసం ఐదేళ్లు అయిందన్నారు. అయితే ఇప్పుడు బీచ్ కి కొట్టుకొచ్చిన తిమింగలం చనిపోయిందని క్లావిన్ వెల్లడించారు. డిసెంబరు నుంచి ఇప్పటి వరకు 14 తిమింగలాలు యూఎస్ తీరానికి కొట్టుకొచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు 2.6 లక్షల వ్యూస్ కూడా వచ్చాయి.  

కొంతమంది స్థానిక అధికారులు, పర్యావరణవేత్తలు ఈ ప్రాంతంలో ఆఫ్‌షోర్ విండ్ ఫామ్‌ను అభివృద్ధి చేయడమే ఈ మరణాలకు కారణమని బీబీసీ ఓ నివేదికలో ఆరోపించింది. అయితే అందుకు గల ఆధారాలు మాత్రం లభించలేదని అధికారులు చెబుతున్నారు. అయితే గత ఆరు సంవత్సరాల నుండి చనిపోయిన తిమింగలాలకు సంబంధించిన సమాచారాన్ని నేషనల్ ఓషనోగ్రాఫిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) సేకరిస్తోంది. ఇప్పటివరకు ఫ్లోరిడా నుండి మైనే వరకు 178 చనిపోయిన హంప్‌బ్యాక్ తిమింగలాలను సేకరించింది. ఇందులో కొన్ని తిమింగలాలకు శవపరీక్షలు జరపగా.. వాటిలో 40% మరణాలు ఫిషింగ్ గేర్‌లో చిక్కుకోవడం లేదా ఓడలు ఢీ కొట్టడం వల్ల, మానవ పరస్పర చర్య వల్ల సంభవించాయని పేర్కొంది.