బంగ్లాదేశ్‎లో భూకంపం.. వెస్ట్ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

బంగ్లాదేశ్‎లో భూకంపం.. వెస్ట్ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

ఢాకా: భారత పొరుగు దేశం బంగ్లాదేశ్‎లో శుక్రవారం (నవంబర్ 21) భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశంలో మరోసారి భూకంపం వచ్చింది. శనివారం (నవంబర్ 22) సాయంత్రం రిక్టర్ స్కేల్‎పై 3.7 తీవ్రతతో బంగ్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో పొరుగున ఉన్న భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది.

నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ (NCS) ప్రకారం శనివారం (నవంబర్ 22) సాయంత్రం 5.36 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్ధంకాక ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు చేశారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. భూ కంప ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యలు చేపట్టింది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. 

►ALSO READ | G20 సమ్మిట్.. ప్రియమైన దోస్త్ మెలోనితో ప్రధాని మోదీ ముచ్చట్లు..వీడియో వైరల్